Latest Movie :
Home » , » Myne pyar kiya Movie Review

Myne pyar kiya Movie Review

{[['']]}

సినిమా రివ్యూ: 'మైనే ప్యార్ కియా'

ఒకప్పడు హిందీలో 'మైనే ప్యార్ కియా' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  దర్శకుడు ప్రదీప్ మాడుగుల 'మైనే ప్యార్ కియా' చిత్ర టైటిల్ తో రూపొందించిన చిత్రం జూన్ 20 తేదిన విడుదలైంది. 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్ర 'ఫేం' ఇషా తల్వార్, ప్రదీప్ బెంటో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా అనే విషయాని తెలుసుకోవాలంటే కథంటే తెలుసుకోవాల్సిందే. 
ఇషా తల్వార్, ప్రదీప్ లు చిన్న నాటి స్నేహితులు. చిన్నతనంలో ఎప్పడూ గొడవ పడుతుంటారు...వారు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగులుగా చేరుతారు. వారం రోజుల్లో నిశ్చితార్ధం జరిగే ఇషాను చూసి మనసు పడుతాడు. తన ప్రేమను ఇషాకు తెలియ చేస్తాడు.  ప్రదీప్ ను ఇష్టపడుతున్నానని తెలుసుకున్న ఇషా తన మనసులోని మాటా చెప్పలానుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ కు ముందు ఓ కారణంగా ప్రదీప్ అంటే ఇషాకు అసహ్యం ఏర్పడుతుంది. ప్రదీప్ ను అసహ్యించుకోవడానికి కారణమేమిటి? ప్రదీప్, ఇషాల మధ్య నెలకొన్న మనస్పర్ధలు ఎలా తొలగించుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే 'మైనే ప్యార్ కియా'.
నవీన్ గా ప్రదీప్, శాలినిగా ఇషా తల్వార్ లు నటించారు. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఇషా తల్వార్ మరోసారి మైనే ప్యార్ కియాతో ఆకట్టుకున్నారు. గ్లామర్ నే కాకుండా అభినయంతో కూడా పర్వాలేదనిపించింది.  కొన్ని సన్నివేశాల్లో ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. అయితే వీరిద్దరీ ఫెర్ఫార్మెన్స్ 'మైనే ప్యార్ కియా'ను విజయం దిశగా నడిపిస్తారా అంటే సమాధానం కష్టమే. ప్రదీప్ స్నేహితుడిగా వేణు పర్వాలేనిపించారు. స్వలింగ సంపర్కుడిగా నటించిన పోసాని కృష్ణమురళి మెప్పించలేకపోయారు. సత్యదేవ్,  స్వప్నమాధురిల పాత్రలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. కొంతలో కొంత సత్యదేవ్, స్వప్న మాధురిలు సెకండాఫ్ లో కొంత ఇంట్రెస్  క్రియేట్ చేసినా సినిమాకు పాజిటివ్ గా మలచలేకపోయారు. 
సాదాసీదా కథకు ఫోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంత మెరుగులు దిద్దారు. క్వాలిటీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సంతోష్ నారాయణ్ ఆలరించారు. ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. మాస్ డైలాగ్స్ తో కొంత ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. సింపుల్ కథతో 'మైనే ప్యార్ కియా' అందించిన ప్రదీప్ మాడుగుల కథనంపై సరైన దృష్టిని పెట్టాలేదనే అభిప్రాయం కలుగుతుంది. కథనం పేలవంగా ఉండటంతో సినిమాపై పట్టు సడలిందనే భావన కలుగుతుంది. అటు మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్ కు, బీసీ ప్రేక్షకుల అభిరుచి దూరంగా ఉన్న 'మైనే ప్యార్ కియా'కు సక్సెస్ ను సొంత చేసుకుంటుందా అని చెప్పడం కష్టమే. 
Share this article :
 
Support : PVS Copyright © 2014. DoReGaMa - All Rights Reserved
Powered by PVS Computers Published by PVS